Chiranjeevi: ఈ రెండు విషయాలపై చిరు స్పందిస్తారా?

* పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి కామెంట్స్ పై చిరు ఎలా స్పందిస్తాడోనని మెగా అభిమానుల ఎదురుచూపు

admin1
Updated on: 30 Sept 2021 12:30 PM IST
Chiranjeevi Fans Waiting for his Reaction on Posani Murali Krishna and Pawan Kalyan
X

మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్ - పోసాని కృష్ణ మురళి(ఫోటో- ది హన్స్ ఇండియా) 

Mega Fans: కొన్ని విషయాల్లో సెలబ్రిటీలు మౌనం వహించటం మంచిది. కానీ కొన్ని కీలకమై విషయాల్లో మాత్రం నోరు విప్పటం కూడా అంతే అవసరం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రెండు విషయాలను అడ్రస్ చేయాల్సిన సందర్భం వచ్చింది. వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న చిరంజీవి ఈ మధ్యనే ఊటీలో తన తదుపరి సినిమా "గాడ్ ఫాదర్ " షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న "రిపబ్లిక్" సినిమా రిలీజ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కొన్ని వివాదాస్పద కామెంట్లు సైతం చేశారు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వాలి అని కొందరు అంటున్నారు. కానీ చిరంజీవి హైదరాబాద్ వచ్చే సమయానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయారు. మరోవైపు పోసాని కృష్ణ మురళి మెగా ఫ్యామిలీపై మండిపడుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో కూడా ఇప్పటి దాకా దీని గురించి మాట్లాడలేదు. పోసాని బూతులు మాట్లాడినప్పటికీ ఆయనపై కేసు సైతం వేయలేదు. మరి మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాలపై రియాక్ట్ అవుతారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ మరియు పోసాని కామెంట్ల మీద చిరంజీవి కచ్చితంగా నోరు విప్పాలని మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

admin1

admin1

Next Story