భోళా శంకర్ విషయంలో చిరంజీవి కీలక నిర్ణయం

Chiranjeevi Decision In The Case Of Bhola Shankar
x

భోళా శంకర్ విషయంలో చిరంజీవి కీలక నిర్ణయం

Highlights

* భోళా శంకర్ సినిమా ను మొదలు పెట్టిన చిరంజీవి.. కారణం అదేనా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా "వాల్తేరు వీరయ్య" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలకపాత్రలో కనిపించారు. చిరంజీవి మరియు రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి చాలా బాగా వర్క్ అవుట్ అయింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతుంది.

అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ఈసారి మెహర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్" అనే సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు చిరంజీవి. అయితే తాజా సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ సక్సెస్ అయ్యాక చిరంజీవి ఇప్పుడు తన ఆలోచనలను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది.

ఈ నేపథ్యంలో సరైన టేకింగ్ ఉంటే మాస్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయని చిరంజీవి అర్థం చేసుకున్నారట. ఈ నేపథ్యంలోనే "భోళా శంకర్" సినిమా షూటింగ్ మరొక రెండో నెలల్లో పూర్తి చేసేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే "వాల్తేరు వీరయ్య" సినిమా ఇంకా థియేటర్లలోనే ఉన్నప్పటికీ చిరంజీవి మాత్రం "భోళాశంకర్" సినిమా షూటింగ్ ను హైదరాబాద్లో మొదలు పెట్టేసారు. హైదరాబాద్ లోనే చిత్ర బృందం కోల్కతా కి సంబంధించిన ఒక సెట్ వేసి సినిమా షూటింగ్ ను కొనసాగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories