Oscar 2023: కోట్ల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి.. ఆర్‌ఆర్‌ఆర్ టీంకు చిరు అభినందనలు

Oscar 2023: కోట్ల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి.. ఆర్‌ఆర్‌ఆర్ టీంకు చిరు అభినందనలు

Jyothi
Updated on: 13 March 2023 11:14 AM IST
Chiranjeevi Congratulates RRR Team Naatu Naatu Oscar
X

Oscar 2023: కోట్ల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి.. ఆర్‌ఆర్‌ఆర్ టీంకు చిరు అభినందనలు

Oscar 2023: నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడంపై ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తెలుగు సినిమా పాటకు ఆస్కార్ రావడం చరిత్రాత్మక విజయంగా భావిస్తున్నానని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ట్రిపుల్ ఆర్‌ సినిమాతో తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందన్నారు. ఆస్కార్ అందుకోవడం భారత్ కల అని, అది ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే సాకారమైందని దర్శకధీరుడు రాజమౌళిని చిరు కొనియాడారు.కోట్ల మంది భారతీయుల హృదయాలు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్‌రక్షిత్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళిల పేర్లను ప్రస్తావిస్తూ అందరికీ చిరు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకించి రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు.


Jyothi

Jyothi

Next Story