Chiranjeevi: కథని పూర్తిగా మార్చేసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: కథని పూర్తిగా మార్చేసిన మెగాస్టార్ చిరంజీవి

Rama Rao
Updated on: 6 July 2022 11:45 AM IST
Chiranjeevi Completely Changed the Story of Waltair Veerayya Movie
X

Chiranjeevi: కథని పూర్తిగా మార్చేసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: కొన్ని కొన్ని సార్లు దర్శకుడు అనుకున్న సినిమాకి చివరికి వచ్చిన అవుట్పుట్ కి మధ్య పొంతన ఉండకపోవచ్చు. దానికి కారణం మధ్యలో హీరో, నిర్మాత లేదా ఎవరో ఒకరు సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

#మెగా154 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి కొంచెం నిరాశ చెందుతున్నారట. ఈ నేపథ్యంలోనే షూటింగ్ ను ఆపేసి డైరెక్టర్ బాబి మరియు రైటర్ కోన వెంకట్ ను కలిసి సినిమాలోని సన్నివేశాలను మరింత ఇంపాక్ట్ ఉండేలాగా రాయమని ఇలా రొటీన్ గా వద్దని చెప్పారట.

ఈ నేపథ్యంలోనే వైజాగ్ లోని ఒక చిన్న పల్లెటూరిలో జరగాల్సిన షూటింగ్ మలేషియా మాల్టా మరియు ఇతర దేశాలకు మారిందని తెలుస్తోంది. అయితే ఫారిన్ ట్రిప్ వల్ల సినిమా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం చిత్ర బృందం మలేషియాకి పయనం అవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఈ సినిమాకి "వాల్తేరు వీరయ్య" అనే టైటిల్ ను అనుకుంటున్నారు.

Rama Rao

Rama Rao

Next Story