Chiranjeevi: సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు.

Arun Chilukuri
Published on: 20 April 2021 8:32 PM IST
Chiranjeevi Announces Free Vaccine for Cinema Workers and Journalists
X

Chiranjeevi: సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని, సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించేందుకు కరోనా క్రైసిస్ చారిటీ తరుపున ఉచితంగా వ్యాక్సినేషన్ వేయించే సదుపాయం కల్పిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అపోలో హాస్పిటల్ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు.

45 ఏళ్లు దాటిన వారిన సినీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి మూడు నెలల పాలు అపోలో ఆసుపత్రి ద్వారా ఉచితంగా వైద్యులను సంప్రదించే అవకాశంతోపాటు, మందులను కూడా రాయితీ ధరలకు అందించే సదుపాయాన్ని కల్పిస్తున్నామని చిరంజీవి తెలిపారు. గతేడాది కరోనా వైరస్‌ సంక్షోభ కాలంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీని ఏర్పాటు చేసిన చిరు దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేసిన సంగతి తెలిసిందే.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story