యువ రైటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన చిరంజీవి, రవితేజ..

* ఇలాంటి కథ ఉంటే సినిమాకి రెడీ అంటున్న చిరంజీవి మరియు రవితేజ

Dhatripriya
Published on: 17 Jan 2023 5:14 PM IST
Chiranjeevi And Ravi Teja Gave A Bumper Offer To Young Writers
X

యువ రైటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన చిరంజీవి మరియు రవితేజ





MultiStarer: మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో తాజాగా ప్రేక్షకులందరికీ వచ్చిన "వాల్తేరు వీరయ్య" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శృతి హాసన్ మరియు కేథరిన్ తెరిసా లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలోనే ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి మరియు రవితేజ కలిసి అప్ కమింగ్ రైటర్లకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. వారు చెప్పిన ఒక లైన్ ఆధారంగా ఎవరైనా మంచి కథను డెవలప్ చేసుకుని వస్తే ఆ సినిమా చేయటానికి తాము రెడీగా ఉన్నామని చిరంజీవి ప్రకటించారు. ఇంతకీ ఐడియా ఏంటి అంటే రవితేజ మరియు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో దొంగలుగా ఉంటారట. అసలు వాళ్ళు దొంగలు ఎందుకు అయ్యారు అనేదానికి ఒక మంచి రీసన్ ఉండేలాగా కథను డెవలప్ చేయమని చెప్పిన చిరంజీవి నిజంగా తాము దొంగలు కాకూడదని దొంగలుగా మారితేనే దొంగలు దొరుకుతారు అనే లాంటి లాజిక్ ఏదైనా కూడా ఉండాలని అన్నారు.

ఇక దొంగలుగా మారడానికి ఫ్లాష్ బ్యాక్ లో ఆ దొంగలు వారి ఫ్యామిలీస్ ని ఏదో చేశారని ఏదో ఒక మంచి రీజన్ కూడా ఉండాలని ఇలాంటి లైన్ తో ఎవరైనా వస్తే తాము సినిమా చేయడానికి సిద్ధమని అన్నారు చిరంజీవి. చాలావరకు కథ చిరంజీవి చెప్పేసారు మరి ఈ ఇద్దరు హీరోలను ఇంప్రెస్ చేసే లాగా ఎవరైనా ఈ కథతో ముందుకు వస్తారేమో చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story