21 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో మళ్లీ రవితేజ

మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా రోల్

admin1
Updated on: 11 Jan 2022 6:00 PM IST
Chiranjeevi and Ravi Teja Acting Togeter on Director KS Ravindra Film
X

మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా రోల్

Chiranjeevi-Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" అనే సినిమాలో నటించబోతున్నారు. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్" సినిమాకి ఓకే చెప్పిన మెగాస్టార్ కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే బాబీ చిరంజీవి సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఒక కీలక పాత్ర పోషించనున్నారట.

ఈ సినిమాలో రవితేజ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండబోతోందని, సినిమా మొత్తం మీద 40 నిమిషాల పాటు ఆయన పాత్ర కనిపించనుందని తెలుస్తోంది. అయితే 21 ఏళ్ల క్రితం 2000 లో "అన్నయ్య" సినిమాలో రవితేజ చిరంజీవి తమ్ముడు పాత్రలో కనిపించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో రవితేజను చూడటం ఇద్దరు హీరోల అభిమానులకి కన్నులవిందుగా ఉంటుందని చెప్పవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

admin1

admin1

Next Story