అన్నయ్య బ్రో డాడీ.. తమ్ముడు బ్రో.. వాటీజ్ ధిస్ బ్రో..

*మొత్తంగా అటు మెగా స్టార్ చిరంజీవి, ఇటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరు బ్రో పదంపై కన్నేశారు.

Jyothi
Updated on: 9 May 2023 9:30 PM IST
Chiranjeevi And Pawan Kalyan Wants To be Bro Title
X

అన్నయ్య బ్రో డాడీ.. తమ్ముడు బ్రో.. వాటీజ్ ధిస్ బ్రో..

Movie News: బ్రో ఈ పదాన్ని నేటి యూత్ తెగ వాడేస్తోంది. అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఇద్దరూ ఈ పదాన్ని తెగ వాడేస్తున్నారు. ఇక ఇదే పదం పై మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరు కన్నేశారు. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులుగా నటించిన సినిమా బ్రో డాడీ. రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన మంచి రెస్పాన్స్ సాధించుకున్న ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు మెగా స్టార్ రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

బ్రో డాడీ తెలుగు రీమేక్ ను సోగ్గాడే చిన్ని నాయన ఫేం కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించనుండగా మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించనుంది చిరంజీవి కొడుకు పాత్ర కోసం డీజే టిల్లు ఫేం సిద్ధూ జొన్నలగడ్డ పేరును ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పవన్ సైతం బ్రో పదం పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తమిళ హిట్ మూవీ వినోదయ సీతమ్ ను పవన్ రీమేక్ చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి బ్రో టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వినోదయ సీతమ్ రీమేక్ తెలుగు వెర్షన్ కు దేవుడు, దేవుడే దిగి వచ్చినా, దేవర ఇలా పలు టైటిల్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఈ టైటిల్స్ ఏవీ కాకుండా బ్రో టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని కన్ ఫామ్ చేస్తూ అతి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో సాయిధరమ్ తేజ్ ను పవన్ బ్రో అని సంబోధిస్తాడు కాబట్టి..ఇదే టైటిల్ కు యాప్ట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయిందట.. మొత్తంగా అటు మెగా స్టార్ చిరంజీవి, ఇటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరు బ్రో పదంపై కన్నేశారు. మరి ఫైనల్ గా ఎవరు ఈ టైటిల్ తో వస్తారో చూడాలి.

Jyothi

Jyothi

Next Story