బాక్స్ ఆఫీస్ క్లాష్ కి సిద్ధమవుతున్న చిరంజీవి మరియు నాగార్జున

Chiranjeevi and Nagarjuna to Fight at Box Office During Dasara Festive Season
x

బాక్స్ ఆఫీస్ క్లాష్ కి సిద్ధమవుతున్న చిరంజీవి మరియు నాగార్జున

Highlights

The Ghost Vs Godfather: కరోనా తర్వాత చాలా కాలం పాటు చాలా వరకు సినిమాలకు సోలో రిలీజ్ లు దక్కాయి.

The Ghost Vs Godfather: కరోనా తర్వాత చాలా కాలం పాటు చాలా వరకు సినిమాలకు సోలో రిలీజ్ లు దక్కాయి. కానీ ఇప్పుడు మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ లు ఏర్పడుతున్నాయి. ఈ మధ్యనే "మాచర్ల నియోజకవర్గం" సినిమా విడుదలైన తర్వాత రోజే "కార్తికేయ 2" సినిమా విడుదలైంది. ఈ రెండిటి మధ్య బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఏర్పడింది. ఆయనప్పటికీ "కార్తికేయ 2" సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతుంది.

త్వరలోనే మరొక రెండు సీనియర్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కి సిద్ధమవుతున్నాయి. అవే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "గాడ్ ఫాదర్" మరియు కింగ్ నాగార్జున నటించిన "ది ఘోస్ట్" సినిమాలు. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" అనే సినిమాకి రీమేక్ గా "గాడ్ ఫాదర్" సినిమా అక్టోబర్ 5న విడుదల కాబోతోంది. ఈ విషయం తెలిసినప్పటికీ నాగార్జున కూడా తన సినిమా "ది ఘోస్ట్" ని అదే రోజున విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

ఈ ఇద్దరిలో ఎవరైనా ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గకపోతే ఈ రెండు సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అవ్వబోతున్నాయి. నిజానికి రెండు సినిమాలకి బజ్ కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించగలదో వేచి చూడాలి. మరోవైపు బెల్లంకొండ గణేష్ నటిస్తున్న "స్వాతి ముత్యం" సినిమా కూడా అదే రోజు విడుదల కి సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories