వారిద్దరినీ హ్యాండిల్ చేసే సత్తా సోహైల్ కు ఉందా?

వారిద్దరినీ హ్యాండిల్ చేసే సత్తా సోహైల్ కు ఉందా?
x
Highlights

''సోహైల్'' ఇప్పుడు ఈ పేరు తెలీని తెలుగు ప్రజలు లేరు. బిగ్ బాస్ లో పదిహేను వారాల పాటు తనదైన స్టయిల్ లో ఆట ఆడి .. మురిపించి.. అందరి మనసులూ గెలుచుకున్నాడు. బిగ్ బాస్ ప్రేక్షకుల మనస్సులో సోహైల్ గెలిస్తే బావుండును అని అనుకునేంత ఇమేజ్ సంపాదించాడు.

''సోహైల్'' ఇప్పుడు ఈ పేరు తెలీని తెలుగు ప్రజలు లేరు. బిగ్ బాస్ లో పదిహేను వారాల పాటు తనదైన స్టయిల్ లో ఆట ఆది.. మురిపించి.. అందరి మనసులూ గెలుచుకున్నాడు. బిగ్ బాస్ ప్రేక్షకుల మనస్సులో సోహైల్ గెలిస్తే బావుండును అని అనుకునేంత ఇమేజ్ సంపాదించాడు. అయితే, ఓటింగ్ లెక్కల్లో అభిజిత్ విజేత గా నిలిచి బిగ్ బాస్ ట్రోఫీ ఎగరేసుకుపోయాడు.

ఇక సోహైల్ అయితే.. కూల్ గా బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ తీసుకుని కూల్ గా మూడో స్థానంతో సరిపెట్టుకుంటా అన్నాడు. అది మామూలు ఆఫర్ ఏమీ కాదు. పాతిక లక్షలు. ఆ ఆఫర్ కు ఒప్పుకుని బయటకు వచ్చిన సోహైల్ కి అదిరిపోయే స్వాగతం దొరికింది బిగ్ బాస్ ఫినాలే స్టేజి మీద. నాగార్జున సోహెల్ ను ఎత్తుకుని గాల్లోకి లేపి మోసుకుంటూ డయాస్ మీదకు తీసుకువెళ్లారు. ఇక హౌస్ లో అంతవరకూ అతనితో జర్నీ చేసిన అందరూ సోహైల్ నిర్ణయానికి ఫిదా అయిపోయారు. అంతేకాదు.. సోహైల్ ఈ నిర్ణయంతో ప్రేక్షకులు కూడా ఖుషీ అయిపోయారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మెగాస్టార్ చిరంజీవి సోహైల్ పై కురిపించిన వరాల జల్లు ఒక ఎత్తు. సోహైల్ సినిమా తీయాలని అనుకుంటున్నామని చెప్పాడు. ఆ సినిమా ఆడియో లాంచింగ్.. వంటి కార్యక్రమంలో ఒక్క దానిలో అన్నయ్య చిరంజీవి వచ్చి ఆశీర్వదించాలి అని కోరాడు. దాంతో చిరంజీవి.. అది పెద్ద విషయం కాదు కచ్చితంగా వస్తాను అన్నారు. అంతే కాదు నీ సినిమాలో నేను ఒక గెస్ట్ రోల్ చేస్తాను. సభాముఖంగా చెబుతున్నాను. ఇది వాస్తవం. అని ప్రామిస్ చేశారు. విజేతగా నిలిచినా అభిజిత్ కి కూడా దొరకని అద్భుతమైన అవకాశం సోహైల్ కి దొరికిందని చెప్పొచ్చు. దీంతో సోహైల్ సినిమా పై ఇప్పటికే పెద్ద అంచానాలు వచ్చేశాయి.

ఇదిలా ఉంటే.. సోహైల్ కి ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ నటులు ఫ్యాన్స్ అయిపోయారు. అందులో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఒకరు. అయన స్వయంగా సోహైల్ కి ఫోన్ చేసి చక్కని ఆట ఆడావు అని అభినందించడమే కాకుండా.. నేను కూడా నీ సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తాను ప్లాన్ చేసుకో అని చెప్పారట. దీంతో సోహైల్ ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాడు.

ఇదంతా సరే.. అసలు సోహైల్ సినిమా ఎప్పడు తీస్తాడు.. తీస్తే మెగాస్టార్..కామెడీ స్టార్ ఇద్దరినీ తన సినిమాలో ఎలా ఉపయోగించుకుంటారు.. ఇది జరిగే పనేనా.. నిజంగా అన్నీ అనుకున్నట్టు జరిగితే వారిద్దరి స్టామినాని హ్యాండిల్ చేసే రేంజిలో సినిమా తీయగలడా అని ఇప్పుడు సోహైల్ అభిమానులు చర్చల్లో మునిగిపోయారు. ఏది ఏమైనా బిగ్ బాస్ ట్రోఫీ మిస్ చేసుకున్నావు. అంతకు మించి అంది వచ్చిన అవకాశం ఇది. దీనిని మిస్ చేసుకోకు. బిగ్ బాస్ ఫినాలే ఎంత స్మార్ట్ గా ఆడావో అంటే స్మార్ట్ గా సినిమా చేయాలి అంటూ సోహైల్ కి విషెస్ చెబుతున్నారు అందరూ/

Show Full Article
Print Article
Next Story
More Stories