రామ్ చరణ్ ఇచ్చిన ఈ మాట కోసమే చిరంజీవి ఈ సినిమాని ఒప్పుకున్నారా?

Chiranjeevi - Creative Commercials: రామ్ చరణ్ చేయలేకపోయిన పని చేస్తున్న మెగాస్టార్

admin1
Updated on: 23 Dec 2021 2:50 PM IST
Chiranjeevi Agreed to do the Film with Creative Commercials | Tollywood News
X

రామ్ చరణ్ చేయలేకపోయిన పని చేస్తున్న మెగాస్టార్(ఫైల్-ఫోటో)

Chiranjeevi - Creative Commercials: దాదాపు పదేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే 'ఖైదీ నెంబర్ 150' సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన్నప్పటి నుంచి దాదాపు సినిమాలన్నీ రామ్ చరణ్ నిర్మించారు. ఖైదీ నెంబర్ 150 మరియు సైరా నరసింహారెడ్డి సినిమాలను నిర్మించిన రామ్ చరణ్ ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమాని కూడా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు మాత్రమే కాక మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న "గాడ్ ఫాదర్", మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ అయినా "భోళా శంకర్" మరియు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరొక సినిమా సైన్ చేశారు చిరంజీవి. "భోళా శంకర్" సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో "తేజ్ ఐ లవ్ యు" ఈవెంట్ కి వచ్చిన రామ్ చరణ్ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ప్రస్తుతం వేరే ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్న రామ్ చరణ్ తన మాట నిలబెట్టుకో లేకపోయారు.

అందుకనే మెగాస్టార్ చిరంజీవి క్రియేటివ్ కమర్షియల్స్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి కి క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో పనిచేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో చిరంజీవి నటించిన "అభిలాష", "చాలెంజ్", "రాక్షసుడు", "మరణమృదంగం", "స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్" చిత్రాలను క్రియేటివ్ కమర్షియల్స్ వారే నిర్మించారు.

admin1

admin1

Next Story