Acharya Movie: మళ్లీ వాయిదా పడనున్న ఆచార్య విడుదల

Acharya Movie: మళ్లీ రీషూట్ చేస్తున్న ఆచార్య సినిమా సన్నివేశాలు

admin1
Updated on: 12 Dec 2021 7:01 PM IST
Chiranjeevi Acharya Movie Reshoots Again for Key Scenes | Acharya Movie Release Date 2022
X

మళ్లీ వాయిదా పడనున్న ఆచార్య విడుదల (ఫైల్ ఫోటో)

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆచార్య". ఈ సినిమా షూటింగ్ రెండేళ్లకి ముందు సెట్స్ పైకి వెళ్ళింది కానీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాని ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను దర్శకనిర్మాతలు రీ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కొన్ని వారాల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారట.

ఇక ఈ రీ షూట్ చేయడానికి దాదాపు పది రోజులు పడుతుంది. ఇంతకుముందు చిరంజీవి ఈ సినిమాని డిసెంబర్ మూడవ వారంలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ అప్పటికి విడుదలకు సిద్ధమవుతున్న "పుష్ప" బృందం తమ సినిమాని వాయిదా వేయడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో జనవరిలో విడుదల చేద్దాం అనుకుంటే అప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. దీంతో ఫిబ్రవరి కి మార్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ రీ షూట్ అనడంతో ఈ సినిమా మరింత వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story