Chiru 154 Movie: రేపు సాయంత్రం తీరం చేరనున్న మెగా అల

Chiranjeevi 154 Movie Poster Release on Chiru Birthday 22 August 2021
x

 చిరు154 (ట్విట్టర్ ఫోటో)

Highlights

Chiru 154 Movie : ఒక వైపు కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో...

Chiru 154 Movie : ఒక వైపు కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన "లుసిఫర్" సినిమా రీమేక్ తో కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మెగాస్టార్ "వెంకీ మామ" ఫేమ్ దర్శకుడు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. # చిరు154 అని పిలవబడుతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇవాళ సోషల్ మీడియా లో విడుదలైంది.

"హై టైడ్ వార్నింగ్.. రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు మెగా అల తీరం చేరుకోనుంది. రోమాలు నిక్క పొడిచే ఒక మెగా పోస్టర్ మీ ముందుకు రాబోతోంది," అంటూ ఈ సినిమాని నిర్మిస్తున్న ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా #చిరు154 సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాకి "భోళా శంకర్" అనే టైటిల్ ను అనుకుంటున్నారని సమాచారం. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories