Most Eligible Bachelor: మొదటిసారిగా తెరపై కనిపించనున్న క్యూట్ కపుల్

admin1
Updated on: 25 Aug 2021 2:00 PM IST
Chinmayi Sripada and Rahul Ravindran Plays a Main Roles in Akhil Most Eligible Bachelor Movie
X

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో రాహుల్ -చిన్మయి(ఫైల్ ఫోటో)

Chinmayi - Rahul Movie: ఇప్పటిదాకా మూడు సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమాతో కూడా మంచి హిట్ అందుకోలేకపోయాడు యువ హీరో అక్కినేని అఖిల్. తాజాగా తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" పైన పెట్టుకున్నాడు ఈ అక్కినేని హీరో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేక్షకులలో సైతం ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో సినిమా సింగర్ చిన్మయి మరియు నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారట.

సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన గాత్రంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న చిన్మయి మొట్టమొదటిసారిగా కెమెరా ముందుకి రాబోతోంది. హీరోగా మరియు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ "చిలసౌ" సినిమాతో దర్శకుడిగా కూడా మారిపోయాడు. అయితే నిజజీవితంలో కూడా భార్య భర్తలు అయిన వీరు కలిసి కెమెరా ముందుకి సినిమా రావటం ఇదే మొదటిసారి. ఇక చిన్మయి మరియు రాహుల్ మధ్య ఈ సినిమాలో కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బన్నీ వాసు మరియు వాసు వర్మ, జీఏ 2 పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story