Zheng Shuang: ట్యాక్స్‌‌‌‌ ఎగ్గొట్టిందని..నటికి రూ. 330 కోట్ల ఫైన్‌‌‌‌

Zheng Shuang: ట్యాక్స్ ఎగ్గొట్టిన టాప్ యాక్ట్రెస్‌కు చైనా అధికారులు భారీ జరిమానా విధించారు.

Arun Chilukuri
Published on: 29 Aug 2021 1:59 PM IST
Chinese Actor Zheng Shuang fined $46 Million for Tax Evasion
X

Zheng Shuang: ట్యాక్స్‌‌‌‌ ఎగ్గొట్టిందని..నటికి రూ. 330 కోట్ల ఫైన్‌‌‌‌

Zheng Shuang: ట్యాక్స్ ఎగ్గొట్టిన టాప్ యాక్ట్రెస్‌కు చైనా అధికారులు భారీ జరిమానా విధించారు. పన్ను ఎగవేతపై చైనా నటి జెంగ్ షువాంగ్‌ 330 కోట్లు కట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 2019, 2020ల్లో ఆమె నటించిన సినిమాలు, టీవీ సిరీస్‌ల కోసం తీసుకున్న పేమెంట్‌కు సంబంధించి సరిగా పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్ ట్యాక్స్ సర్వీస్ గుర్తించింది. దీంతో పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. ఆదాయపు పన్ను ఎగవేత కేసు వెలుగులోకి వచ్చిన తరువాత, చైనా బ్రాడ్‌కాస్టింగ్ ఆర్గనైజేషన్ అన్ని షోల నుండి జెంగ్ షువాంగ్‌ను తొలగించింది. చైనాలో ప్రజల మధ్య సంపదలో తేడాలను తగ్గించేందుకు ఆ దేశం తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం సెలబ్రిటీలపై అక్కడి సర్కారు నిఘా పెరిగింది. పన్ను ఎగవేస్తున్న వాళ్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story