Chikiri Chikiri Song: చికిరి చికిరి తెచ్చి పెట్టిన సమస్య

Chikiri Chikiri Song: చికిరి చికిరి తెచ్చి పెట్టిన సమస్య
x

Chikiri Chikiri Song: చికిరి చికిరి తెచ్చి పెట్టిన సమస్య

Highlights

‘పెద్ది’ నుంచి వచ్చిన చికిరి చికిరి పాట రిలీజై పది రోజులు దాటినా, దాని క్రేజ్ మాత్రం ఇంకా తగ్గే లేనట్లే ఉంది. సోషల్ మీడియాలో ఈ పాట ప్రభావం మార్మోగుతోంది.

'పెద్ది’ నుంచి వచ్చిన చికిరి చికిరి పాట రిలీజై పది రోజులు దాటినా, దాని క్రేజ్ మాత్రం ఇంకా తగ్గే లేనట్లే ఉంది. సోషల్ మీడియాలో ఈ పాట ప్రభావం మార్మోగుతోంది. ప్రత్యేకించి రీల్స్ క్రియేటర్స్ ఈ సాంగ్‌పై ఎన్ని లక్షల వీడియోలు చేశారో లెక్కపట్టడం కష్టమే. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ షార్ట్‌లు స్క్రోల్ చేసినా అక్కడక్కడా చికిరే కనిపించే పరిస్థితి.

ఏఆర్ రెహమాన్‌ నుంచి ఇంత భారీ చార్ట్‌బస్టర్ వస్తుందని ఆయన అభిమానులకే కాదు, చిత్రబృందానికీ ఊహించని విజయం ఇది. ముఖ్యంగా హిందీ వెర్షన్ సాధిస్తున్న రీచ్ చూసి దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాణ సంస్థ విస్తుపోతున్నారు. ఇదే ఫ్లో మిగిలిన పాటలు, ట్రైలర్‌కు కూడా వస్తే ఉత్తరాది మార్కెట్‌లో ‘పెద్ది’కి పెద్ద డిమాండ్ ఏర్పడటం ఖాయం.

చికిరి చికిరి తెచ్చి పెట్టిన ‘అదృశ్య సమస్య’

అయితే ఈ పాట తెచ్చిన ఒక ప్రధాన ఇబ్బంది కూడా ఉంది. చికిరి చిక్కిరి స్థాయి క్రేజ్‌ను చూసిన తర్వాత, కొత్తగా వచ్చిన లిరికల్ వీడియోలు ఏవి అయినా అదే లెవెల్‌కు చేరుకున్నాయా అన్న దానిపై ప్రేక్షకులు, అభిమానులు ఆటోమేటిగానే పోలికలు పెడుతున్నారు.

ఇటీవల రిలీజైన ఆంధ్రకింగ్ ఫ్యాన్ సాంగ్, అఖండ 2 పాటలు వేటికవే బాగానే ఉన్నా రీచ్ పరంగా మాత్రం చికిరి దూకుడుతో పోలిస్తే నెమ్మదిగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ‘పెద్ది’ ఈ స్థాయి మేజిక్ చేయకపోయి ఉంటే, మిగిలిన పాటలకు మరింత మంచి రీచ్ వచ్చేదని ఇండస్ట్రీలో మాట వినిపిస్తోంది.

ఈ మధ్య సంగీత హిట్ రేంజ్ కొలవాలంటే యూట్యూబ్ వ్యూస్ మాత్రమే కాదు, రీల్స్ సంఖ్య కూడా కీలక ప్రమాణంగా మారిపోయింది. ఈ రంగంలో మాత్రం చికిరి చికిరే డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

రెండో పాట రెడీ… కానీ జాగ్రత్తగా

ఈ క్రేజ్ చల్లారక ముందే ‘పెద్ది’ టీమ్ రెండో పాట విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే మన శంకరవరప్రసాద్ గారు తన కంటెంట్‌తో క్లాష్ కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. డిసెంబర్ చివరి వారంలో రెండో సాంగ్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నప్పటికీ, అప్పటి పరిస్థితులను బట్టి ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు.

ఏది ఏమైనా చికిరి చికిరి హ్యాంగోవర్ మాత్రం ప్రేక్షకులపై బాగా పనిచేస్తోంది.

అన్నట్టు, ‘గేమ్ చేంజర్’లో శంకర్ వంటి లెజెండరీ దర్శకుడు పూర్తిగా వినియోగించుకోలేకపోయిన రామ్ చరణ్ ఎనర్జీని, రెండో సినిమా మాత్రమే చేస్తున్న బుచ్చిబాబు ఈ స్థాయిలో బయటకు తీసుకురావడం నిజంగా విశేషమే.

Show Full Article
Print Article
Next Story
More Stories