Top
logo

Cheque Bounce Case: రాధిక, శరత్‌కుమార్‌ దంపతులకు షాక్‌, ఏడాది జైలు శిక్ష

Cheque Bounce Case: Court Sentences Radhika and Sarathkumar to one Year Imprisonment
X

Cheque Bounce Case: రాధిక, శరత్‌కుమార్‌ దంపతులకు షాక్‌, ఏడాది జైలు శిక్ష

Highlights

Cheque Bounce Case: సినీ నటి రాధిక, శరత్‌కుమార్‌ దంపతులకు చెన్నై స్సెషల్‌ కోర్టు షాక్ ఇచ్చింది.

Cheque Bounce Case: సినీ నటి రాధిక, శరత్‌కుమార్‌ దంపతులకు చెన్నై స్సెషల్‌ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్‌ బౌన్స్‌ కేసులో రాధిక, శరత్‌కుమార్‌ దంపతులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. శరత్ కుమార్, రాధిక గతంలో పలు సినిమాలు నిర్మించారు. ఆ సినిమాల నిర్మాణ సమయంలో ఓ సంస్థ నుండి పెద్ద ఎత్తున రుణం తీసుకున్నారు.

తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వాలని సదరు సంస్థ ఒత్తిడి పెంచడంతో శరత్ కుమార్, రాధిక చెక్కు ఇచ్చారు. వారు ఇచ్చిన చెక్ బౌన్స్‌ అవ్వడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించిది. దీంతో కేసును విచారించిన చెన్నై స్పెషల్ కోర్టు ఇద్దరికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇద్దరు సినీ ప్రముఖ దంపతులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు రావడం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Web TitleCheque Bounce Case: Court Sentences Radhika and Sarathkumar to one Year Imprisonment
Next Story