Cheating on the Name of Singer Sunitha; సింగర్ సునీత పేరుతొ మోసం! పోలీసులకు ఫిర్యాదు!!

Cheating on the Name of Singer Sunitha; సింగర్ సునీత పేరుతొ మోసం! పోలీసులకు ఫిర్యాదు!!
x
Highlights

Cheating on the name of singer sunitha: సినిమా ఇండస్ట్రీలో మాకు వారు తెలుసు వీరు తెలుసు అంటూ మీకు అవకాశాలు ఇప్పిస్తాం అని చెప్తూ కొంతమంది...

Cheating on the name of singer sunitha: సినిమా ఇండస్ట్రీలో మాకు వారు తెలుసు వీరు తెలుసు అంటూ మీకు అవకాశాలు ఇప్పిస్తాం అని చెప్తూ కొంతమంది మోసాలకు పాల్పడుతుంటారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి మోసాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇదే విషయమై ఇటీవలే కొందరు సెలబ్రిటీలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అలాంటి మోసగాళ్ల మాయలకు బ్రేకులు పడటం లేదు. తాజాగా ఇప్పుడు ఈ సింగర్ విషయంలో కూడా అలానే జరిగింది. ఓ వ్యక్తి నేను సింగర్ సునీత మేనల్లుడిని అని చెప్పి డబ్బులు వసూల్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని సునీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఆమె మాట్లాడుతూ.. నేను అందరికీ ఒక విషయంపై క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. చైతన్య అనే అతను నా మేనల్లుడు అని చెప్పి, సెలబ్రిటీలతో పరిచయాలు పెంచుకుంటున్నాడట. అవకాశాలు ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడని కూడా తెలిసింది. ఇది తెలిసి నేను షాక్ అయ్యాను. నాకసలు చైతన్య అనే మేనల్లుడు లేనే లేడు. దయచేసి ఇకపై ఎవరూ మోసపోకండి. మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా చెబుతున్నాను. సెలబ్రేటీల పేరు చెప్పగానే ఎలా డబ్బులు ఇస్తారని.. ప్రతి రోజు మీడియాలో ఇలాంటి వార్తలు వస్తున్నా.. ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అయినా కూడా ఎందుకు అలాంటివారిని నమ్ముతారు అంటూ సునీత అసహనం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల పేర్లు వాడుకుని లాభం పొందేందుకు చాలామంది కుట్రలు చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ చీటర్‌ తన కంటబడితే వాడి పళ్లు రాలగొడతానని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టనని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సునీత చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories