Chatrapathi Remake: రాజమౌళి అతిధిగా రేపే "ఛత్రపతి" రీమేక్ ప్రారంభం
Chatrapathi Hindi Remake (SS Rajamouli & Bellamkonda Sreenivas): (File Photo)
Chatrapathi Remake: బెల్లంకొండ సురేష్ తనయుడిగా తెలుగు సినిమాకి హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి చిత్రం "అల్లుడు శీను" చిత్రంతో హిట్ సాధించిన ఆ తర్వాత "జయ జానకి నాయక" చిత్రం మినహా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు కూడా లేవు. ఇటీవల విడుదల అయిన "అల్లుడు అదుర్స్" చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా "ఛత్రపతి" సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సిద్దంగా ఉన్నాడు. దీంతో అటు బాలీవుడ్ ఎంట్రీతో పాటు ముందే "ఛత్రపతి" సూపర్ హిట్ చిత్రం అవడంతో కథపై కూడా పూర్తి నమ్మకంతో ఎలాగైనా ఈ సారి హిందీలో సూపర్ హిట్ సాధించాలనే తపనతో ఉన్నాడు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శుక్రవారం హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ రీమేక్ చిత్రానికి "ఛత్రపతి" చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా పాల్గొని షూటింగ్ ని ప్రారంభించనున్నాడు. దాదాపుగా 3 కోట్ల రూపాయలతో పల్లెటూరి సెట్ ని కూడా ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు సిద్ధం చేశాడు. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించగా డాక్టర్ గడా మరియు పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ "ఛత్రపతి" రీమేక్ తో బాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, వివి వినాయక్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారు.




