Akkineni Akhil: ఏజెంట్ సినిమాలో హైలైట్గా నిలబడనున్న చేజింగ్ సీన్

Akkineni Akhil: చేజ్ లతో అలరించనున్న అక్కినేని అఖిల్

admin1
Updated on: 13 Aug 2021 4:50 PM IST
Chasing Scenes Going to be Hilight in Agent Movie
X
అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా (ఫైల్ ఇమేజ్)

Akkineni Akhil: "అఖిల్" సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన అక్కినేని అఖిల్ ఇప్పటికి మూడు సినిమాల్లో హీరోగా నటించాడు కానీ అందులో ఒక్క సినిమా కూడా అతనికి మంచి విజయాన్ని సాధించలేకపోయింది. అయినప్పటికీ అఖిల్ కు సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఒకవైపు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో "ఏజెంట్" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ మాస్ లుక్ తో కొత్తగా మేకోవర్ అయ్యాడు.

సినిమా కోసం సిక్స్ ప్యాక్ కూడా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు అఖిల్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక చేజింగ్ సీన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. ఒక పదిహేను నిమిషాల పాటు సాగే ఈ చేజింగ్ సీన్ హాలీవుడ్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. కేవలం ఈ సీన్ కోసమే చిత్ర బృందం విదేశాలకు కూడా వెళ్ళనున్నారు. అక్కడ హాలీవుడ్ టెక్నీషియన్ల సహాయంతో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. ఇక ఆ సీన్ సినిమా మొత్తానికి హైలెట్గా నిలబడుతుందని దర్శకనిర్మాతలు నమ్ముతున్నారు. మరి ఈ సినిమాతో అయినా ఈ యువ హీరో ఎంతవరకు విజయం సాధిస్తాడో చూడాల్సిందే.

admin1

admin1

Next Story