పూరీ జగన్నాథ్ తో రిలేషన్ షిప్‌ పై క్లారిటీ ఇచ్చిన చార్మి

"ప్రేక్షకులు నన్ను పూరిని రోల్ మోడల్ లాగా చూస్తారు" అని అంటున్న చార్మి

Arun Chilukuri
Updated on: 18 Aug 2022 6:30 PM IST
Charmy Kaur Clarity on Relation With Puri Jagannadh
X

పూరీ జగన్నాథ్ తో రిలేషన్ షిప్‌ పై క్లారిటీ ఇచ్చిన చార్మి

Charmy Kaur: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు ఒకప్పటి హీరోయిన్ ఛార్మి మధ్య రిలేషన్ గురించి ఇప్పటికే టాలీవుడ్ లో బోలెడు పుకార్లు వినిపించాయి. పెళ్లయిపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న పూరి జగన్నాథ్ ఛార్మి తో ప్రేమలో పడ్డారని కొందరు చెబుతుండగా ఈ విషయంలో పూరి తన భార్యతో విడాకులు కూడా తీసుకోబోతున్నారు అని మరికొందరు పుకార్లు సృష్టించారు.

ఇక హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న చార్మి గత కొంతకాలంగా నిర్మాతగా సెటిల్ అయింది. దాదాపు పూరి సినిమాలన్నిటికీ నిర్మాతగా లేక సహానిర్మాతగా వ్యవహరిస్తూ చార్మి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లైగర్ సినిమా గురించి కూడా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తనకి పూరికి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది చార్మి.

"జనాలు ఎప్పుడూ కొన్నిటిని వాళ్ళకి నచ్చినట్టుగానే చూడాలి అనుకుంటారు. ఏదేమైనా అంతా సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైగర్ మరియు జనగణమన సినిమాలు బ్లాక్ బస్టర్ లు అయ్యాక ప్రేక్షకులు నన్ను పూరి గారిని రోల్ మోడల్స్ లో చూస్తారు. మేము ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాము అని మాట్లాడుకుంటారు. మిగతా పుకార్లను నేను పెద్దగా పట్టించుకోను," అని కొట్టిపారేసింది చార్మి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story