Charmy Kaur Aunt Passed Away: చార్మీ ఇంట విషాదం!

Charmy Kaur Aunt Passed Away: సినీ నటి, నిర్మాత చార్మీ ఇంట విషాదం నెలకొంది. ఆమె బంధువులో ఒకరైనా ఆమె అత్తగారు లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషయాన్నీ చార్మీ

Krishna
Updated on: 17 July 2020 1:21 PM IST
Charmy Kaur Aunt Passed Away: చార్మీ ఇంట విషాదం!
X
charmi kaur(file photo)

Charmy Kaur Aunt Passed Away: సినీ నటి, నిర్మాత చార్మీ ఇంట విషాదం నెలకొంది. ఆమె బంధువులో ఒకరైనా ఆమె అత్తగారు లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషయాన్నీ చార్మీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్నీ ఆమె వెల్లడిస్తూ భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. మీరు లేరనే వార్తను తట్టుకోలేకపోతున్నానని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

నిన్ననే మనం మాట్లాడుకున్నాం కానీ ఇదే చివరిసారి అవుతుంది అని అనుకోలేదు.. ప్రస్తుతం మీరు లేరు అనే మాటను వినలేకపోతున్నా..మీరు లేరని తెలిసాక మాటలు రావడం లేదు.. పైన స్వర్గంలో కూడా నీకు నచ్చినట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటావని అనుకుంటున్నాను. పైన ఉన్న అప్పితో కలిసి ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నాను. మిమల్ని చాలా మిస్ అవుతున్నాను.. నాకెంతో ప్రియమైన ఆంటీ మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఛార్మి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

చార్మీ ఇంట్లో విషాదం.!


ఇక అటు చార్మీ చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో చార్మీ నిర్మాతగా మారారు.. ఆమె చివరిసారిగా జ్యోతి లక్ష్మి అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకి నిర్మాత కూడా చార్మీనే.. ఇక ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాని పూరితో కలసి నిర్మించింది. ఈ సినిమా అటు పూరికి ఇటు చార్మీకి మంచి పేరును తీసుకువచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఫైటర్ అనే సినిమాకి కూడా చార్మీ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Krishna

Krishna

Next Story