Charmme Kaur: నటన పై ఇంట్రెస్ట్ లేదు అంటున్న హీరోయిన్

*ఇండస్ట్రీ ఇంకా నన్ను ఒక హీరోయిన్ లా చూస్తుంది *ప్రతి వారం కనీసం రెండు మూడు సినిమా ఆఫర్లు వస్తూ ఉంటాయి

admin1
Published on: 25 Oct 2021 2:57 PM IST
Charmme Kaur is not Interested to act in Movies Says in an Interview | Today Cinema News
X

ఛార్మి (ట్విట్టర్ ఫోటో)

Charmme Kaur: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల లో ఒకరైన ఛార్మి గత కొన్ని ఏళ్లుగా వెండి తెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పీసీ కనెక్ట్ బ్యానర్ లో లైన్ ప్రొడ్యూసర్ గా సెటిలైంది ఛార్మి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇకపై కూడా తాను సినిమాల్లో నటించే అవకాశం లేదని చెప్పారు.

ఇప్పటికీ ప్రతి వారం కనీసం రెండు మూడు సినిమా ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఇండస్ట్రీ ఇంకా నన్ను ఒక హీరోయిన్ లా చూస్తుంది. కానీ నాకు మాత్రం నటనపై ఇంట్రెస్ట్ లేదు. నేను భవిష్యత్తులో కూడా నటించే అవకాశం లేదు" అని అన్నారు చార్మి.

ఇక నటన కి మరియు ప్రొడక్షన్ కి చాలా తేడా ఉందని హీరోయిన్ గా ఉన్నప్పుడు జీవితం చాలా కంఫర్టబుల్గా ఉండేదని కేవలం అందం, హెల్త్ మరియు ఫిట్నెస్ చూసుకుంటే సరిపోయేది అని కానీ నిర్మాతగా తను సెట్లో అందరూ కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకోవాల్సి వస్తోందని, రాత్రింబవళ్ళు కష్టపడి పని చేయాల్సి వస్తుందని అన్నారు.

ఇక చార్మి ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న "లైగర్" సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

admin1

admin1

Next Story