Charmy Kaur: మహేష్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన ఛార్మి

Charmy Kaur: మహేష్ కి పూరి బదులు చార్మి ఇచ్చిన రిప్లై

admin1
Published on: 28 Sept 2021 7:44 PM IST
Charmi Kaur Replying to Maheshs Tweet on Puri Birthday Wishes
X
మహేష్ బాబు ట్వీటీకి రిప్లయ్ ఇచ్చిన (ఫైల్ ఇమేజ్)

Charmy Kaur: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి అభిమానులు మరియు సెలబ్రిటీలు పూరి పై శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పూరి జగన్నాథ్ ని పుట్టినరోజు సందర్భంగా విష్ చేశారు. ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు పూరి జగన్నాథ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపగా, పూరి బదులు ఆ ట్వీట్ కి ఛార్మి జవాబు ఇవ్వడం అందరిని దృష్టిని ఆకర్షించింది. కానీ మహేష్ బాబు అభిమానులు వీరిద్దరిపై ఫైర్ అవుతున్నారు.

గతంలో పూరీ జగన్నాథ్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబు కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమాని కేన్సిల్ చేశారు. దీని గురించి మాట్లాడుతూ మహేష్ బాబు తనకు డేట్లు ఇవ్వలేదని పూరిజగన్నాథ్ ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కి విషెస్ చెప్పినప్పుడు పూరి ఆ ట్వీట్ కి రిప్లై ఇవ్వకపోవడం దానికి ఛార్మి రిప్లై ఇవ్వడం ఏంటి అని అభిమానులు ఛార్మి పై ఫైర్ అవుతున్నారు. ఇకనైనా పూరి తన మనస్పర్ధలు దూరం చేస్తే బెటర్ అని మహేష్ ఫ్యాన్స్ చెప్తున్నారు.

admin1

admin1

Next Story