Acharya Movie Update: ఆచార్య సెట్ లో రామ్ చరణ్

Acharya Movie Update: 'ధర్మస్థలి తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి' ఆచార్య నుండి ఓ పోస్టర్ ను విడుదల అయ్యింది.

Kranthi
Published on: 11 July 2021 9:24 AM IST
Charan Enters Dharmasthala for Acharya
X

ఆచార్య సెట్ లో రామ్ చరణ్

Acharya Movie Update: ఆచార్య మళ్లీ కెమెరా ముందుకొచ్చేంది. కరోనా బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ తన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆచార్య సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అయిపోయాడు. చిరంజీవితో పాటు.. కొడుకు రామ్ చరణ్ కూడా షెడ్యూల్ కి వచ్చేస్తున్నాడు. ఇక కొన్ని రోజులే.. అంతా అనుకున్నట్లు జరిగితే ఇక ఆచార్య సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది. రామ్ చరణ్ పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ.. 'ధర్మస్థలి తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి' అని పేర్కొన్నారు. 'ఆచార్య' కొత్త పోస్టర్ లో రామ్ చరణ్ కోర మీసాలతో మెడలో రుద్రాక్ష.. నుదిటిన బొట్టుతో నడుచుకుంటూ వస్తూ సరికొత్తగా కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో కామ్రేడ్ సిద్ధ అనే పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే చిరు కూడా ధర్మస్థలి సెట్స్ లో అడుగుపెడతారని తెలుస్తోంది.

Kranthi

Kranthi

Next Story