Barabar Premistha: చంద్రహాస్ పాటపై దుమారం: అసభ్య పదజాలంపై క్షమాపణలు చెప్పిన చిత్రయూనిట్.. జేడీ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు!

Chandrahas Song Controversy: యంగ్ హీరో చంద్రహాస్ నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది.

Arun Chilukuri
Published on: 5 Feb 2026 12:12 PM IST
Barabar Premistha: చంద్రహాస్ పాటపై దుమారం: అసభ్య పదజాలంపై క్షమాపణలు చెప్పిన చిత్రయూనిట్.. జేడీ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు!
X

Chandrahas Song Controversy: యంగ్ హీరో చంద్రహాస్ నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ వేడుకలో చంద్రహాస్ పాడిన 'గుంజి గుంజి' పాటలో అసభ్య పదజాలం వాడటంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకనిర్మాతలతో పాటు నటుడు జేడీ చక్రవర్తి స్పందించారు.

పొరపాటు జరిగింది - నిర్మాత విచారం:

ఈ వివాదంపై నిర్మాత చిన్ని స్పందిస్తూ.. చంద్రహాస్ తన పాత్ర స్వభావాన్ని వివరించే క్రమంలో ఆ పాట పాడారని, అందులో అసభ్య పదాలు దొర్లడం యాదృచ్ఛికంగా జరిగిన పొరపాటు అని తెలిపారు. ఈ విషయంపై ఈవెంట్‌లో ఉన్న ఎవరికీ ముందుగా అవగాహన లేదని, చంద్రహాస్ కావాలని చేయలేదని ఆయన వివరించారు. పాట పాడి కిందకు వచ్చిన తర్వాత అతడిని మందలించినట్లు నిర్మాత వెల్లడించారు.

సినిమాలో అలాంటి పాటలు లేవు:

దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. చంద్రహాస్ తీరుపై విచారం వ్యక్తం చేశారు. అయితే, సినిమాలో ఎక్కడా ఇలాంటి అసభ్యకరమైన పాటలు లేవని, కేవలం స్టేజ్ పైన మాత్రమే ఇది జరిగిందని స్పష్టం చేశారు.

జేడీ చక్రవర్తి స్పందన:

చంద్రహాస్ పాట పాడుతున్నప్పుడు వేదికపై ఉన్న జేడీ చక్రవర్తి ఆపలేదన్న విమర్శలపై ఆయన స్పందించారు. సినిమా ప్రమోషన్లు విభిన్నంగా చేయడం తప్పు కాదని, కానీ మహిళలను కించపరిచేలా లేదా అసభ్యకరంగా ఉండకూడదని ఆయన హితవు పలికారు. ఆ సమయంలో తాను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందని జేడీ చక్రవర్తి అభిప్రాయపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story