Chandra Mohan: ఇవాళ పంజాగుట్ట శ్మశానవాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు

Chandra Mohan Funeral Today at Panjagutta
x

Chandra Mohan: ఇవాళ పంజాగుట్ట శ్మశానవాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు

Highlights

Chandra Mohan: తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన చంద్రమోహన్

Chandra Mohan: తెలుగు చిత్రసీమలో గొప్ప నటుల్లో ఒకరిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చంద్రమోహన్ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో, ఇవాళ ఉదయం హైదరాబాదులోని పంజాగుట్ట శ్మశాన వాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చంద్రమోహన్ నివాసం నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశాన వాటికకు అంతిమయాత్ర చేపట్టనున్నారు. మధ్యలో తెలుగు ఫిలిం చాంబర్ వద్ద కొద్దిసేపు ఆపుతారని వార్తలు వస్తున్నప్పటికీ, ఆ వార్తలను చంద్రమోహన్ కుటుంబ సభ్యులు ఖండించారు. పరిశ్రమలో ఉన్నవారు చాలామంది ఇంటికే వచ్చి నివాళులు అర్పించారని, ఇప్పటికే రెండ్రోజుల సమయం గడిచిందని, అందువల్ల నేరుగా శ్మశానవాటికకు తరలిస్తున్నట్టు కుటుంబసభ్యులు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories