Chandini Chowdary: నిర్మాత బెదిరించారు అంటున్న చాందిని చౌదరి

Chandini Chowdary: నిర్మాత బెదిరించారు అంటున్న చాందిని చౌదరి

Rama Rao
Updated on: 15 Jun 2022 8:30 PM IST
Chandini Chowdary Clarified About the Threats From the Producer
X

Chandini Chowdary: నిర్మాత బెదిరించారు అంటున్న చాందిని చౌదరి

Chandini Chowdary: షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్న వైజాగ్ బ్యూటీ చాందినీ చౌదరి తాజాగా ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ లో కూడా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన అందంతో మాత్రమే కాక నటనతో కూడా అందరినీ మెప్పిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సమ్మతమే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న చాందిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ప్రముఖ నిర్మాత తన కెరీర్ ను నాశనం చేయాలని అనుకున్నట్లుగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

అతను చెప్పింది చేయకపోతే టాలీవుడ్ లో తనకు ఎక్కడా చోటు ఉండదని ఆ సదరు నిర్మాత ఆమెను బెదిరించినట్లు గా చెప్పింది చాందిని. ఒక షో కి గెస్ట్గా వెళ్లిన చాందినీ చౌదరి తనకి జరిగిన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరోవైపు సినిమాలలో కూడా చాందిని కి అంత పెద్ద అవకాశాలు ఏమి రావటం లేదు. వచ్చిన చిన్నా చితకా అవకాశాలతో కూడా మంచి హిట్లు దొరకటం లేదు. మరి ఈ నేపథ్యంలో చాందిని ఎంతవరకు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందో వేచి చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story