Pushpa Update: క్రిస్మస్ బరిలో నుండి తపుకున్న "పుష్ప" పార్ట్ 1?

Pushpa Update: మరింత వాయిదా పడనున్న "పుష్ప"

admin1
Updated on: 26 Oct 2021 6:31 PM IST
Chance to Postpone the Pushpa Part 1 Movie Release
X
క్రిష్టమస్ మారిలోనుండి తప్పుకొనున్న పుష్ప సినిమా (ఫైల్ ఇమేజ్)

Pushpa Update: ఈమధ్యనే "అల వైకుంఠపురం లో" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన మొదటి పార్ట్ ఈ ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతోందని దర్శక నిర్మాతలు ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం "పుష్ప పార్ట్1" విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఇంకా సినిమాకి సంబంధించి పదిహేను రోజుల షూటింగ్ మిగిలి ఉందట. అందుకే సినిమా డిసెంబర్ లో విడుదల అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. "ఆర్య" మరియు "ఆర్య2" వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్లో రానున్న మూడవ సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో ఫాహధ్ ఫాసిల్ విలన్ పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక హిందీ, తమిళ్, మలయాళం, మరియు కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story