Ravibabu: చలపతిరావు అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తాం

Ravibabu: మంగళవారం వరకు మహాప్రస్థానంలో ఫ్రీజర్‌లో పార్థివ దేహాన్ని ఉంచుతాం

Jyothi
Published on: 25 Dec 2022 11:28 AM IST
Chalapathi Rao Funeral Will be Held on Wednesday
X

Ravibabu: చలపతిరావు అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తాం

Ravibabu: తన తండ్రి చలపతిరావు నిన్న రాత్రి భోజనం చేసే వరకు బాగానే ఉన్నారని, తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయారని చలపతిరావు కుమారుడు దర్శకుడు, నిర్మాత, నటుడు, రవి బాబు వెల్లడించారు. తమ చెల్లెల్లిద్దరూ అమెరికాలో ఉన్నారని, వారు రావడానికి టిక్కెట్లు దొరకడం లేటయిందన్నారు. వారంతా మంగళవారం రాత్రికి ఇండియాకు చేరుకుంటారని ఆయన తెలిపారు. మంగళవారం వరకు మహాప్రస్థానంలో ఫ్రీజర్‌లో పార్థివ దేహాన్ని ఉంచుతామని వెల్లడించారాయన తన తండ్రి అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story