Chalaki Chanti: అందరినీ నవ్వించే చంటి జీవితంలో తీరని విషాదం

Chalaki Chanti: "మా అమ్మ నా ముందే కాలిపోయింది" అంటూ ఎమోషనల్ అయిన చలాకి చంటి

Rama Rao
Updated on: 15 Sept 2022 7:30 PM IST
Chalaki Chanti  is Emotional in Bigg Boss 6 | Telugu Movie News
X

Chalaki Chanti: అందరినీ నవ్వించే చంటి జీవితంలో తీరని విషాదం

Chalaki Chanti: జబర్దస్త్ టీవీ షో తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే చలాకీ చంటి తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ 6 హౌస్ లోకి కాంటెస్ట్ గా ఎంటర్ అయ్యి మరింత నవ్వులను పంచుతున్నాడు. తన మాటలతో తిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాడు. అటు బిగ్ బాస్ ఇంట్లోనే కాకుండా ఇటు ఆడియన్స్ ని కూడా ఇంతగా నవ్విస్తున్న చంటి జీవితంలో మాత్రం అంతులేని విషాదం దాగుంది అని కొంతమందికే తెలుసు. తాజాగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ పూర్తయిన తర్వాత ఇంటి సభ్యులందరూ కూర్చొని తమ జీవితాల్లోని విషాద సంఘటనల గురించి పంచుకున్నారు. ఈ నేపథ్యంలో చలాకీ చంటి కి కూడా తన జీవితంలో జరిగిన విషాదాన్ని అందరితో పంచుకున్నారు.

"ముందుగానే చెప్పేస్తున్నాను నాకు ఆడవాళ్లు అంటే అసలు పడదు. నేను ఎవరికీ దగ్గర కాను ఎవరిని అభిమానించను. ఉదయాన్నే నిద్ర లేచే సమయానికే నా కూతుళ్లు స్కూల్ కి వెళ్ళిపోతారు వాళ్ళు నిద్రపోయాక నేను ఇంటికి వస్తాను. ఏమైనా కావాలంటే కొనిస్తాను ఎక్కడికైనా కావాలంటే తీసుకెళ్తాను కానీ ఎక్కువగా దగ్గర అవను. ఎందుకంటే ఎవరికైనా నేను దగ్గర అయితే వాళ్ళు నాకు దూరం అవుతారని అనిపిస్తుంది. అది నా సెంటిమెంట్‌ చిన్నప్పుడే నాన్న చనిపోయారు. ఊహ తెలిశాక అమ్మ నా కళ్ల ముందే కాలిపోయింది. నేను చూస్తుండగానే మా అమ్మ మంటల్లో కాలిపోయింది. ఆ తర్వాత అన్నయ్య, నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం.

సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకున్నాను. నా భార్య గర్భవతి అయ్యింది. డెలివరీ సమయంలో ఆస్పత్రికి వెళ్లాను. కూతురు పుట్టింది. నాకు ఎత్తుకోవాలన్నా భయం. కింద టీ కొట్టు ఉంటే అక్కడికి వెళ్లి గంటన్నర ఏడ్చాను. కచ్చితంగా మా అమ్మే ఇద్దరిగా వచ్చింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. తల్లిదండ్రుల అందరికీ చెప్పేది ఒక్కటే. తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఓపిక లేకపోతే కనకండి. ఈ షో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏదైనా ఉంది అంటే అది అడుక్కుతినండి కానీ, పిల్లలను రోడ్డుమీద వదిలేయకండి అని మాత్రమే" అని ఎమోషనల్‌ అయిపోయాడు చంటి.

Rama Rao

Rama Rao

Next Story