ప్రపంచవ్యాప్తంగా 'మజిలీ' కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా మజిలీ కలెక్షన్లు
x
Highlights

పెళ్లికి ముందు మూడు సినిమాలలో కలిసి నటించిన సమంత, నాగ చైతన్య పెళ్లి తర్వాత మొదటిసారిగా 'మజిలీ' సినిమా లో కలిసి నటించారు. ఈ సినిమా ఎమోషనల్ డ్రామా గా...

పెళ్లికి ముందు మూడు సినిమాలలో కలిసి నటించిన సమంత, నాగ చైతన్య పెళ్లి తర్వాత మొదటిసారిగా 'మజిలీ' సినిమా లో కలిసి నటించారు. ఈ సినిమా ఎమోషనల్ డ్రామా గా ఏప్రిల్ 5 న విడుదలైంది. నిజజీవితంలో భార్య భర్తల్లా నటించిన సామ్, చై ఈ సినిమాలో కూడా అలానే కనిపించారు. ఓపెనింగ్ రోజునుండే ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటుంది. 'జెర్సీ', 'కాంచన 3' వంటి సినిమాలు విడుదలవ్వడంతో ఈ సినిమా కలెక్షన్లపై కొంత ప్రభావం చూపింది. మూడవ ఆదివారం వచ్చేటప్పటికి 'మజిలీ' 35.57 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశాలు పెద్దగా లేవు. అయినప్పటికీ 'మజిలీ' సినిమా చై కెరీర్ లో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చైతు కెరీర్ లో ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసుకుంది ఈ సినిమా. 17 రోజుల్లో 'మజిలీ' కలెక్షన్లు ఏరియా వైస్ గా ఇలా ఉన్నాయి.

నిజాం: 12.05 కోట్లు

సీడెడ్: 4.08 కోట్లు

ఉత్తర ఆంధ్ర: 4.07 కోట్లు

ఈస్ట్: 1.65 కోట్లు

వెస్ట్: 1.27 కోట్లు

కృష్ణ: 1.75 కోట్లు

గుంటూరు: 2.01 కోట్లు

నెల్లూరు: 0.84 కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 4.02 కోట్లు

ఓవర్సీస్: 3.85 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా గ్రోస్: 60.05 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా షేర్: 35.57 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories