Chaavu Kaburu Challaga: 'ఆహా'లో 'చావు కబురు చల్లగా' వచ్చిందోచ్

Chaavu Kaburu Challaga: థియేటర్లలో విడుదల అయిన కొద్ది రోజులకే సినిమాలు ఓటీటీల్లో దర్శనిమిస్తున్నాయి.

Samba Siva Rao
Published on: 23 April 2021 3:41 PM IST
Chavukaburu Challaga Movie on Aha
X

చావు కబురు చల్లగా మూవీ ఫైల్ ఫోటో

Chaavu Kaburu Challaga: థియేటర్లలో విడుదల అయిన కొద్ది రోజులకే సినిమాలు ఓటీటీల్లో దర్శనిమిస్తున్నాయి. జాంబిరెడ్డి, క్రాక్, నాంది ఇలా అన్ని సినిమాలు రిలీజ్ అయిన రెండు వారాల్లో ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'చావు కబురు చల్లగా'. ఈ చిత్రం కౌశిక్‌ దర్శకత్వంలో రూపొందింది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ఒదిగిపోయి నటించారు. ఇక భర్త కోల్పోయిన యువతి పాత్రలో లావణ్య మెప్పించింది.

అల్లు అరవింద్‌ సమర్పనలో..ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. ఈ చిత్రం 'ఆహా'లో ఏప్రిల్‌ 23న ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఆహా సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. ఆమని, మురళీశర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 23 నుంచి ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. 'ఆహా' ఈ విషయాన్ని అధికారికంగా తమ ట్విటర్‌లో వెల్లడించింది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story