90 ఎంఎల్ కు సెన్సార్ బ్రేక్! విడుదల ఉందా..లేదా?

90 ఎంఎల్ కు సెన్సార్ బ్రేక్! విడుదల ఉందా..లేదా?
x
Highlights

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా తరువాత మరో సినిమాకు సెన్సార్ బ్రేక్ పడినట్టు తెలుస్తోంది.

బోల్డ్ కంటెంట్ తో సినిమాలు తీసి.. బోల్డ్ టైటిల్స్ తో ఆకర్షించి విషయం లేకుండా సొమ్ము చేసుకుంటున్నాయి కొన్ని సినిమాలు. ఈ కోవలో ఈ మధ్య చాలానే సినిమాలు వచ్చాయి. వాటి సెన్సార్ విషయం లో పెద్దగా అభ్యంతరాలు రాలేదు.

ఇప్పుడు సెన్సార్ బోర్డు కాస్త గట్టిగా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల రామ్ గోపాల్ వర్మ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా సెన్సార్ కాకుండా ఆగిపోయింది. ఇందులో బోల్డ్ కంటెంట్ లేకపోయినా, రాజకీయ పరమైన విమర్శలు, రాజకీయ నాయకులను పోలిన వ్యక్తులు ఉన్న కారణంగా వివాదాలు రేగుతాయని సెన్సార్ నిరాకరించారు.

ఇప్పుడు ఈ దెబ్బ మరో సినిమాకూ పడింది. రేపు (డిసెంబర్ 5) విడుదల కావాల్సి ఉన్న యువ హీరో కార్తికేయ సినిమా 90 ఎంఎల్ సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో పడింది. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి భారీ ఆడియో, వీడియో కట్ లు సూచించిందట సెన్సార్ బోర్డు. అయితే, వాటికి చిత్ర యూనిట్ నిరాకరించిందని సమాచారం.

ఆరెక్స్ 100 సినిమాతో హీరోగా పాప్యులారిటీ తెచ్చుకున్న హీరో కార్తికేయ నటిస్తున్న 90 ఎంఎల్ సినిమా ఇప్పటికే టైలర్లు, టీజర్లతో ఆసక్తికి కలిగించింది. అయితే, ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ లేకపోయినా, కొన్ని డైలాగులు, సీన్స్ కత్తిరించాల్సిందే అని సెన్సార్ సూచించిందని, దానికి చిత్ర బృందం అభ్యంతరం వ్యక్తం చేసిందనీ సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి సినిమా విడుదలకు ఒక్కరోజే ఉన్న తరుణం లో సినిమా విడుదల కోసం దిగివస్తుందా.. లేకపోతే వేరే ప్రయత్నాలు చేస్తుందా అనేది తేలాలి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ఇబ్బందులు తలెత్తినట్టే భావించాల్సి వస్తోంది.

కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న 90 ఎంఎల్ సినిమాను శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ బేనర్ పై అశోక్ రెడ్డి గుమ్మంకొండ నిర్మిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories