సెన్సార్ పూర్తి చేసుకున్న సీత

సెన్సార్ పూర్తి చేసుకున్న సీత
x
Highlights

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వరుస డిజాస్టర్ లను అందుకుంటూ వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యనే 'కవచం' సినిమాతో మరొక...

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వరుస డిజాస్టర్ లను అందుకుంటూ వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యనే 'కవచం' సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్నాడు. తాజాగా 'సీత' అనే సినిమాతో బాక్సాఫీసు వద్ద మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు బెల్లంకొండ హీరో. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ తో బయటకు వచ్చింది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మన్నారా చోప్రా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 24న విడుదల కాబోతోంది. బెల్లంకొండ, కాజల్ కలిసి 'కవచం' అనే సినిమాలో నటించారు. ఇది వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండవ సినిమా. మరి ఈ సినిమాతోనైనా బెల్లంకొండ కెరీర్ లో ఒక హిట్ నమోదు చేస్తుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories