Radhe Shyam Review: రాధేశ్యామ్ రివ్యూ చెప్పిన సెన్సార్ సభ్యుడు ఉమైర్ సందు

Radhe Shyam Review: రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా సంక్రాంతి బరిలో నుండి తప్పుకుంది...

admin1
Updated on: 5 March 2022 1:24 PM IST
Censor Board Member Gave a Radhe Shyam Movie Review | Tollywood News Today
X

Radhe Shyam Review: రాధేశ్యామ్ రివ్యూ చెప్పిన సెన్సార్ సభ్యుడు ఉమైర్ సందు

Radhe Shyam Review: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా రాధేశ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా సంక్రాంతి బరిలో నుండి తప్పుకుంది. తాజాగా ఇప్పుడు భారీ అంచనాల మధ్య ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమా ఒక ఫాంటసీ ప్రేమకథ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా దుబాయ్ సెన్సార్ బోర్డ్ కి సంబంధించిన ఉమైర్ సంధు సోషల్ మీడియా ద్వారా రాధేశ్యామ్ సినిమా గురించి చెప్పుకొచ్చారు. "రాధేశ్యామ్ ఫస్ట్ హాఫ్ చూశాను. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ మరియు పూజా మధ్య కెమిస్ట్రీ ఎలక్ట్రిఫైయింగ్ గా అనిపించింది. రాధేశ్యామ్ లో మిస్టరీ ఇంకా ఉంది. ఇది ఒక విభిన్నమైన కాన్సెప్ట్," అని సినిమాని ఆకాశానికి ఎత్తేసారు ఉమైర్.

ఇటలీ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమా వివిధ భారతీయ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కృష్ణంరాజు, సత్యరాజ్, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి తదితరులు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టీ సిరీస్ మరియు యు వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ నేపథ్య సంగీతాన్ని అందించారు.

admin1

admin1

Next Story