logo
సినిమా

Father's Day 2022: ఫాదర్స్ డే స్పెషల్.. తండ్రితో జ్ఞాపకాలను షేర్ చేసుకున్న సెలబ్రెటీస్..

Celebrities Share Fathers Day Wishes
X

Father’s Day 2022: ఫాదర్స్ డే స్పెషల్.. తండ్రితో జ్ఞాపకాలను షేర్ చేసుకున్న సెలబ్రెటీస్..

Highlights

Father’s Day 2022: ఒక్కరోజు స్మరణతో పోయే బంధం కాదది. ఒకే రోజు తలుచుకుని చెప్పుకునే అనుబంధం కాదది.

Father's Day 2022: ఒక్కరోజు స్మరణతో పోయే బంధం కాదది. ఒకే రోజు తలుచుకుని చెప్పుకునే అనుబంధం కాదది. ఊపిరి తీసుకున్న క్షణం నుంచి.. జీవితపు చివరి అంచుల వరకూ అన్నిదశాల్లోనూ ప్రభావితం చేసే శక్తి అది. నాన్న.. రెండక్షరాలు.. కానీ ఆ శబ్దం ఇచ్చే అనుభూతి ప్రతి తండ్రికి ఓ మధురస్మృతి. ప్రతి తయునికి జీవిత కాలపు పెన్నిధి. నేడు ఫాదర్స్‌ డే (జూన్‌ 19). ఈ సందర్భంగా టాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఒక గొప్ప తనయుడిగా.. గర్వించే తండ్రిగా అందమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నారు మెగాస్టార్.

మరోవైపు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా నాన్న కృష్ణకు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలుపుతూ..'నాన్న అనే పదానికి నాకు సరైన నిర్వచనం తెలియజేశారు. మీరు లేకుండా నేను లేను. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న'అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు.

'నాన్న నువ్వు నాకోసం తీసుకున్నా ప్రతి నిర్ణయం ప్రతి కష్టం ప్రతి శ్రమ ప్రతి అడుగు నా మదిలో వెంటాడుతూనే ఉంటాయి ఐ లవ్ యు నాన్న'అని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేశాడు.

Web TitleCelebrities Share Fathers Day Wishes
Next Story