కొత్త ఏడాదికి స్వాగతం పలికిన స్టార్స్ .. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా రావాలంటూ చిరంజీవి ట్వీట్

కొత్త ఏడాదికి స్వాగతం పలికిన స్టార్స్ .. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా రావాలంటూ చిరంజీవి ట్వీట్
x
Highlights

గత సంవత్సరం కాలగర్భంలో కలుపుతూ.. కొత్త ఏడాది కొత్త దశాబ్దం ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వాలని కోరుతూ సినీ ప్రముఖులు నూతన సంవత్సర...

గత సంవత్సరం కాలగర్భంలో కలుపుతూ.. కొత్త ఏడాది కొత్త దశాబ్దం ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వాలని కోరుతూ సినీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా సినీతారలు తమ న్యూఇయర్‌ వేడుకలకు సంబంధించిన ఫొటోలు అభిమానులతో పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రజలందరికి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. 'థ్యాంక్యూ 2020 మాకు ఓర్పును నేర్పావు. మా జీవితాలు మార్చావు. ప్రకృతి ఎంత విలువైందో అర్థమయ్యేలా చేశావు. వెల్‌కమ్‌ టు ది న్యూ ఇయర్‌. ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలి. బోలెడంత సంతోషాన్నివ్వాలి. మీ కలలన్నీ నిజం కావాలి. అలాగే కొవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా రావాలి అంటూ మెగాస్టార్ ట్విట్ చేశారు.


హ్యాపీ న్యూ ఇయర్‌.. ఈ ఏడాది మొత్తం ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషామే ఉండాలని కోరుకుంటున్నా' - కాజల్‌

నా ప్రియమైన జీవితభాగస్వామితో కలిసి 2021 మొత్తాన్ని సంతోషంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ ఏడాది మన జీవితాల్లో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను' సోనమ్‌ కపూర్‌ తన భాగస్వామితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. సోనమ్‌ కపూర్‌, ఆనంద్‌ అహుజా కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. గాఢంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్‌ చేశారు.

మనం గతంలో వదిలిపెట్టిన దానికంటే ఎన్నో మంచి విషయాలు మన కోసం భవిష్యత్తులో రానున్నాయి. సహనం, స్నేహం, కృతజ్ఞతలు.. ఇలా 2020 మనకి ఎన్నో విషయాలను నేర్పించింది. అందరికీ ఆయురారోగ్యాలు, సంతోషం మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు' - నమ్రత శిరోద్కర్‌






Show Full Article
Print Article
Next Story
More Stories