Chalapathi Rao: అందరూ సరదాగా ఉండేలా చూసుకునే వ్యక్తి చలపతిరావు: చిరంజీవి

Chalapathi Rao: మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచి చలపతి నాకు మిత్రుడు: చిరంజీవి

Jyothi
Published on: 25 Dec 2022 1:06 PM IST
Celebrities Condolence to Chalapathi Rao
X

Chalapathi Rao: అందరూ సరదాగా ఉండేలా చూసుకునే వ్యక్తి చలపతిరావు: చిరంజీవి

Chalapathi Rao: ఇండస్ట్రీలో ఒకరి తర్వాత మరొకరి మరణం తనను కలిచివేస్తోందన్నారు చిరంజీవి. మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచి తనకు చలపతి మిత్రుడన్నారు. విలక్షణమైన నటనతో ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉంటూ జనాల్ని మెప్పించారన్నారు. ఎప్పుడు సరదాగా ఉంటూ, అవతలి వ్యక్తులను కూడా సరదాగా ఉండేలా చూసుకునే వ్యక్తి అన్నారు. - (చిరంజీవి).

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో నటుడి మృతి బాధాకరమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాదాపు 1500 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన చలపతిరావు పేరును.. గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కించాలన్నారు. రవి బాబు తనకు మిత్రుడని.. చలపతిరావుతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. చలపతిరావు కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. -(కోమటిరెడ్డి వెంకటరెడ్డి).

Jyothi

Jyothi

Next Story