సిరివెన్నెల మృతిపై ప్రముఖుల సంతాపం

Sirivennela Sitarama Sastry: సిరివెన్నెల హఠాన్మరణం టాలీవుడ్ కు తీరని లోటని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 30 Nov 2021 6:45 PM IST
Celebrities Condolence Death of Sirivennela Seetharama Sastry Death
X

సిరివెన్నెల మృతిపై ప్రముఖుల సంతాపం

Sirivennela Sitarama Sastry: సిరివెన్నెల హఠాన్మరణం టాలీవుడ్ కు తీరని లోటని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

సిరివెన్నెల పండిత పామరుల హృదయం చూరగొన్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.

సిరివెన్నెల ఇక లేరనే వార్త మనస్తాపానికి గురి చేసిందని, సాహితీ రంగంలో ఆయన నెలకొల్పిన విలువలు శిఖర సమానమనీ అన్నారు జగన్. ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు.

సిరివెన్నెల మరణం సినీ రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు మాజీ సీఎం చంద్రబాబు.

సిరివెన్నెల మరణంతో తన ఎడమ భుజం కోల్పోయానని కళాతపస్వి విశ్వ నాథ్ అన్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళి సై సైతం సిరివెన్నెల మృతికి సంతాపం ప్రకటించారు.

సిరివెన్నెల లేకపోతే తాను లేనన్న రచయిత భాస్కరభట్ల. ఈ వార్తవిని తట్టుకోలేక పోతున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.

సినిమా పాటకు సాహిత్య గౌరవాన్నికల్పించిన వ్యక్తి సిరివెన్నెల అన్నారు బాలక్రిష్ణ. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story