సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఎంత పని చేశావు.. నెట్టింట నివాళులు!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఎంత పని చేశావు.. నెట్టింట నివాళులు!
x
Sushant Singh Rajput (File Photo)
Highlights

ఒక నటుడినటనకు కొలమానం అంటూ చెప్పలేని విషయం. వారి నట జీవితంలో వారు చేసిన సినిమాలు..

ఒక నటుడినటనకు కొలమానం అంటూ చెప్పలేని విషయం. వారి నట జీవితంలో వారు చేసిన సినిమాలు.. పోషించిన పాత్రలు అన్నీ బేరీజు వేసినా ఎక్కడో ఒకదగ్గర కొంత వెలితి కనబడుతుంది. అయితే, కొన్ని పాత్రల విషయంలో ఆయన తప్ప.. అని కచ్చితంగా ప్రేక్షకులు అనుకునే సందర్భాలు చాలా కొద్ది మందికే ఉంటాయి. అవి కూడా ఎన్నో సినిమాల్లో చేసిన తరువాత అటువంటి పాత్ర దొరుకుతుంది. టాలెంట్ ఉన్న నటుడు ఆ పాత్ర దొరికినప్పుడు తన విశ్వరూపం చోపిస్తాడు. చిన్న వయసులోనే.. అదీ కొద్ది సినిమాల అనుభవంతోనే అంతటి పాత్ర దొరకటం.. దానితో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం చలా అరుదైన సందర్భాలలోనే జరుగుతుంది. సరిగ్గా అలాంటి అరుదైన అవకాశం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో జరిగింది.

చిన్న స్థాయి నుంచి నటుడిగా జేవితం ప్రారంభించిన సుశాంత్ కు ధోనీ బయోపిక్ లో అవకాశం దొరికింది. ఆ సినిమాలో ధోనీ లా సుశాంత్ చూపించిన అభినయం నభూతో అన్నరీతిలో ఉంటుంది. నిజానికి ధోనీ కూడా ఆ సినిమాలో సుశాంత్ చేసిన నటనకు ఫిదా అయిపోయారు. అంతటి పేరు తెచ్చుకున్న సుశాంత్ అతి చిన్న వయసులో ఒత్తిడికి లొంగిపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు ట్విట్టర్ లో ప్రధాని నుంచి సాధారణ నెటిజన్ల వరకూ వేలాది మంది సుశాంత్ మరణం పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సుశాంత్ కోసం పలువురు సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా వెల్లడించిన నివాలుల గుచ్చం ఇక్కడ ఇస్తున్నాం.. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఆ సందేశాలను మీరూ చూడండి!

Live Updates: Bollywood Actor Sushant Singh Rajput suicide


Show Full Article
Print Article
More On
Next Story
More Stories