Corona Second Wave : సెలబ్రిటీస్ పై కరోనా పంజా.. ఆందోళనల్లో ఇండస్ట్రీలు

Corona Second Wave : ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Venkata Chari
Updated on: 5 April 2021 6:58 AM IST
Celebrities Affected by Covid-19
X

కరోనా బారిన పడిన సెలెబ్రిటీలు (ఫొటో ట్విట్టర్)

Corona Second Wave: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓవైపు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నా... మరోవైపు ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ సెకండ్ వేవ్ పంజాతో సాధారణ ప్రజానీకమే కాదు... సెలబ్రిటీలు విలవిల్లాడిపోతున్నారు. సినీ ఇండస్ట్రీలోనూ కేసులు పెరిగిపోతుండడంతో... పరిశ్రమల్లో ఆందోళన కనిపిస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ తో నష్టాల్లో ఉన్న సనీ పరిశ్రమ... కరోనా పాజిటివ్ కేసులతో తల్లడిల్లిపోతోంది.

తాజాగా నివేద థామస్ కరోనా బారిన పడడంతో మరోసారి ఉలిక్కిపడింది సినీ పరిశ్రమ. దీంతో వారు ప్రస్తుతం చేస్తున్న షూటింగ్స్ ఆగిపోయాయి. వారితో ఉన్న వారికి వైరస్ అంటే ప్రమాదం కూడా ఉండడంతో.. తమను కలిసిన వారు కూడా టెస్టులు చేయించుకోవాలని సెలబ్రిటీస్ కోరుతున్నారు. కరోనా లాక్ డౌన్ వలన ఓ ఆర్నేల్లు షూటింగ్స్ లేక ఖాలీగా ఉన్న నటీనటులు ఇటీవలే పున: ప్రారంభించారు. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇండస్ట్రీ ఈ పాజిటివ్ కేసులో మరలా ఆందోళన చెందుతున్నారు. కరోనా కేసులు పెరగడంతో... థియేటర్స్‌లో జనాల సంఖ్య తక్కువుతోంది. దీంతో ఆదాయం తగ్గుతోంది. త్వరలో విడుదల కానున్న సినిమాలు నష్టాలు వాటిల్లే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి.


కోవిడ్ బారిన పడిన అక్షయ్ కుమార్ | Akshay Kumar | Photo : Twitter


కోవిడ్ బారిన పడిన నివేదా థామస్ | Nivetha Thomas | Photo : Twitter


కరోనా సెకండ్ వేవ్‌లో కోవిడ్ బారిన పడిన రణ్ బీర్ కపూర్ | Ranbir Kapoor |Photo : Twitter


కరోనా సెకండ్ వేవ్‌లో కోవిడ్ బారిన పడిన అమీర్ ఖాన్ | Amir Khan | Photo : Twitter


కరోనా సెకండ్ వేవ్‌లో కోవిడ్ బారిన పడిన మాధవన్ | Madhavan | Photo : Twitter


కోవిడ్ బారిన పడిన బప్పీలహరి | Bappilahari | Photo : Twitter


కోవిడ్ బారిన పడిన ఆలియా భట్ | Alia Bhatt | Photo : Twitter

Venkata Chari

Venkata Chari

Next Story