Macherla Niyojakavargam: రెండవ హీరోయిన్ ను పరిచయం చేసిన "మాచర్ల నియోజకవర్గం"

Catherine Tresa Going to be Act as Second Heroine in Macherla Niyojakavargam Movie
x
మాచెర్ల నియోజకవర్గం సీన్లలో సెకను హీరోయిన్ గా కథెరిన్ తెరెసా (ఫైల్ ఇమేజ్)
Highlights

Macherla Niyojakavargam: నితిన్ తో రొమాన్స్ చేయబోతున్న "వరల్డ్ ఫేమస్ లవర్" బ్యూటీ

Macherla Niyojakavargam: నితిన్ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "మేస్ట్రో". హిందీ సినిమా "అందాధున్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా మరియు నభానటేష్ హీరోయిన్లుగా నటించారు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించింది. తాజాగా ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయినా "మాచర్ల నియోజకవర్గం" పైనే పెట్టుకున్నాడు నితిన్. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉండబోతోందని దర్శక నిర్మాతలు ప్రకటించారు.

సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాలో క్యాథరిన్ తెరిసా కూడా హీరోయిన్ పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి మరియు నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కాబోతోందని ఈ మధ్యనే దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "వరల్డ్ ఫేమస్ లవర్" సినిమాలో కనిపించిన కేథరీన్ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories