Actress Madhavi Latha: సినీ నటి మాధవీలతపై కేసు నమోదు..

Actress Madhavi Latha: సినీ నటి మాధవిలత పైన కేసు నమోదు అయింది. మాధవిలత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో

Krishna
Published on: 18 Aug 2020 12:07 PM IST
Actress Madhavi Latha: సినీ నటి మాధవీలతపై కేసు నమోదు..
X
madhavi latha (File Photo)

Actress Madhavi Latha: సినీ నటి మాధవిలత పైన కేసు నమోదు అయింది. మాధవిలత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తాజా పరిస్థితుల పైన ఆమె ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు.. అయితే తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా ఒక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఓ పోస్ట్ చేయడంతో నగరంలోని వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణ అనే స్టూడెంట్ ఆమెపై సైబర్‌క్రైమ్‌ కింద రాచకొండ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. గోపీకృష్ణ ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు మాధవీలత పై 295-A సెక్షన్ కింద కేసు నమోదు చేసారు. అంతకుముందు సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై కూడా ఇదే సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

ఇక ఆమె సినిమాల విషయానికి వచ్చేసరికి రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన నచ్కావులే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాధవీలత.. ఈ సినిమా మంచి విజయవంతం అయింది. అంతకుముందు మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిథి సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. ఇక ఆ తర్వాత నానీ సరసన స్నేహితుడా అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా అంత పెద్దగా విజయం సాధించలేదు. ప్రస్తుతం మాధవీలత మెయిన్ లీడ్ లో "లేడీ" అనే సినిమాని చేస్తోంది. రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Krishna

Krishna

Next Story