రాముడిపై అనుచిత వ్యాఖ్యలు .. కత్తి మహేష్ పై కేసు నమోదు

Krishna
Updated on: 11 Feb 2020 1:50 PM IST
రాముడిపై అనుచిత వ్యాఖ్యలు .. కత్తి మహేష్ పై కేసు నమోదు
X

హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముడిపై సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతనిపై నాంపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. ఉమేష్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపిసి సెక్షన్ 505 (1) (సి), 502 (2) కింద కేసులు నమోదు చేశారు. కత్తి మహేష్ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన సమాజంలో సామరస్యాన్ని, శాంతిని దెబ్బతీస్తుందని ఉమేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదేకాకుండా కత్తి మహేష్ పై మరో కేసు నమోదు అయింది. కె కరుణ సాగర్ అనే న్యాయవాది కత్తి మహేష్ పై కేసు నమోదు చేశారు. హిందూ దేవునికి, మతానికి వ్యతిరేకంగా మహేష్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా కత్తి మహేశ్ రాముడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయండంతో అతనిని ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన సంగతి తెలిసిందే..

Krishna

Krishna

Next Story