Prakash Raj: చంద్రయాన్ 3 పై వివాదాస్పద పోస్ట్.. ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు

Prakash Raj: చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని నటుడు ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదైంది.

Arun Chilukuri
Published on: 22 Aug 2023 5:10 PM IST
Case Filed Against Actor Prakash Raj Over Chandrayaan-3 Post
X

Prakash Raj: చంద్రయాన్ 3 పై వివాదాస్పద పోస్ట్.. ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు

Prakash Raj: చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని నటుడు ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదైంది. క‌ర్నాట‌కలోని భ‌గ‌ల్‌కోట్ జిల్లాలోని బన‌హ‌ట్టి పోలీసు స్టేష‌న్‌లో హిందూ సంఘాల నేత‌లు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. దీంతో బనహట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని విమ‌ర్శించ‌డం స‌రికాదని ఇటు నెటిజెన్లు అంటున్నారు.

ట్విటర్‌లో ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్.. బ్రేకింగ్ న్యూస్ చంద్రుడిపై చంద్రయాన్ 3 తీసిన తొలి ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆ కార్టూన్‌లో ఓ వ్య‌క్తి లుంగి క‌ట్టుకుని.. టీ పోస్తున్న‌ట్లు ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించకుండానే.. ఆయననే ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశానికే ప్రతిష్ఠ తెచ్చిన చంద్ర‌యాన్‌ 3 ప్ర‌యోగాన్ని ఉద్దేశించి రాజకీయంగా విమ‌ర్శించ‌డం ప్రకాశ్ రాజ్‌కు స‌రికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story