కంగనా పైన కేసు నమోదు!

కంగనా పైన కేసు నమోదు!
x

Kangana Ranaut

Highlights

Case File On kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పైన కేసు నమోదు అయింది. ఆమెతో పాటుగా ఆమె సోదరి రంగోలి చందేల్‌ పైన కూడా కేసు నమోదైంది. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

Case Filled On kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పైన కేసు నమోదు అయింది. ఆమెతో పాటుగా ఆమె సోదరి రంగోలి చందేల్‌ పైన కూడా కేసు నమోదైంది. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కంగనా, రంగోలి ఇంటర్వ్యూలు, ట్వీట్లు సోషల్ మీడియా ద్వారా దేశంలోని పలు సంఘాల మధ్య చిచ్చు పెడుతున్నాయని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని సయ్యద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఐపిసి సెక్షన్లు 153 ఎ (శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 ఎ (మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేసే హానికరమైన చర్యలు) మరియు ఆమె సోదరిపై 124 ఎ (దేశద్రోహం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు. అయితే దీనిపై స్పందించిన కంగనా మహారాష్ట్రలోని పప్పు సేనకు తనపై మక్కువ ఎక్కువై పోయిందంటూ వ్యంగ్యంగా కమెంట్ చేశారు. అంత మిస్ అవ్వద్దు.. త్వరలోనే అక్కడకు వస్తాను అంటూ ట్వీట్ చేసింది కంగనా..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత మహా సర్కార్ పైన, ముంబై పోలీసుల పైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది కంగనా.. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చింది కంగనా.. ఈ క్రమంలో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కంగనా పైన మండిపడ్డారు. దీనితో మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఈ క్రమంలోని సెప్టెంబర్ 9 న ముంబైలోని ఆమె కార్యాలయాన్ని అక్రమంగా ఉందంటూ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు కొంత భాగాన్ని కూల్చి వేశారు. దీంతో అదే రోజున కంగనా ముంబై హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ ఎస్.జె. కథవల్లా నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేతను నిలిపివేసింది. ఇక ఈ పిటిషన్ లో కంగనా తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు గాను బీఎంసీ తనకు రెండు కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని తన పిటిషన్ లో కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories