Actress: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.? ఇండస్ట్రీని షేక్‌ చేస్తోందీ బ్యూటీ..!

Actress: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత హీరోయిన్లకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం క్షణాల్లో వైరల్‌ అవుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Nov 2024 1:07 PM IST
Can you Guess who is This Cute Little Girl now she is Actress
X

Actress: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.? ఇండస్ట్రీని షేక్‌ చేస్తోందీ బ్యూటీ..!

Actress: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత హీరోయిన్లకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం క్షణాల్లో వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలతో పాటు చిన్న నాటి ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరోయిన్‌ చిన్ననాటి ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్‌.? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలో వెళ్లాల్సిందే.

పైన ఫొటోలో క్యూట్‌ స్మైల్‌తో ఆకట్టుకుంటున్న చిన్నారిని చూశారా.? ఆ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.? ఇండస్ట్రీలో ఆమె టాప్‌ హీరోయిన్‌. భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్‌గా మంచి పేరు సంపాదించుకుంది. హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. తెలుగు, హింది, తమిళ, మలయాల భాషల్లో అగ్ర కథనాయకుల సరసన ఆడిపాడిందీ చిన్నది. తాజాగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతోంది ఇంతకీ హీరోయిన్‌ ఎవరో ఐడియా వచ్చిందా.?

ఈ బ్యూటీ మరెవరో కాదు తమన్నానే. 15 ఏళ్ల వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తమన్నా టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. దాదాపు అందరు టాప్‌ హీరోల సరసన ఆడిపాడింది. హిందీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది ఆ తర్వాత శ్రీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల స్త్రీ2 మూవీలో స్పెషల్‌ సాంగ్‌లో నటించి దేశాన్ని ఊపేసింది. ఇక ప్రసస్తుతం బాలీవుడ్‌లో ఒక సినిమా ఓదేలా2తో తెలుగులో మరో సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న తమన్నా.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రియుడు విజయ్‌ వర్మను త్వరలోనే తమన్నా పెళ్లి చేసుకోబోతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story