రామ్ చరణ్ కోసం రంగంలోకి దిగిన ఆస్కార్ గ్రహీత

Ram Charan: రామ్ చరణ్ కోసం ఆస్కార్ గ్రహీత ను తీసుకొచ్చిన బుచ్చి బాబు

Jyothi
Updated on: 10 April 2023 8:30 PM IST
Butchi Babu Brought the Oscar winner for Ram Charan
X

రామ్ చరణ్ కోసం రంగంలోకి దిగిన ఆస్కార్ గ్రహీత

Ram Charan: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. #ఆర్సీ15 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ కి "గేమ్ చేంజర్" అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. కీయార అద్వానీ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేశారు.

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా "ఉప్పెన" వంటి సూపర్ హిట్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ కోసం కూడా ఒక అదిరిపోయే స్క్రిప్ట్ తో వచ్చారట. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే రామ్ చరణ్ "ఆర్ఆర్ఆర్" సినిమాలో నుండి "నాటు నాటు" పాటకి ఆస్కార్ లభించింది.

మరోవైపు ఏ ఆర్ రహ్మాన్ కూడా ఆస్కార్ గ్రహీతే. ఇప్పుడు ఏ ఆర్ రెహమాన్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ పూర్తి అయిన తర్వాత బుచ్చిబాబు సినిమాని మొదలు పెట్టనున్నారు.

Jyothi

Jyothi

Next Story