"అది బాలయ్య గొప్పతనం" అంటున్న సాయి మాధవ్ బుర్ర

* "అది బాలయ్య గొప్పతనం" అంటున్న సాయి మాధవ్ బుర్ర

Dhatripriya
Updated on: 31 Dec 2022 5:00 PM IST
Veera Simha Reddy Is A Rare Story Telling Dialogue Writer
X

 "వీర సింహా రెడ్డి" ఒక అరుదైన కథ అంటున్న డైలాగ్ రైటర్

SaiMadhav Burra: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "వీర సింహారెడ్డి" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్ర బృందం.

ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను జనవరి 6న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి డైలాగులను అందించిన సాయి మాధవ్ బుర్ర సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. "ఈ సినిమా కి డైలాగులు రాస్తున్నప్పుడు కథలో ఉన్న సోల్ ని హైలెట్ చేసే లాగా రాయాలి అనుకున్నాను. పక్కా కమర్షియల్ సినిమా అయినప్పటికీ వీర సింహారెడ్డి వంటి కథ చాలా అరుదుగా ఉంటుంది. కథ విన్నాక నాకు చాలా సంతోషంగా అనిపించింది.

కథలో కొన్ని హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి" అని చెప్పకు వచ్చారు సాయి మాధవ్. అంతేకాకుండా సినిమాకి సంబంధించిన విషయాలన్నిటిలోనూ బాలయ్య డైరెక్టర్ కి చాలా ఫ్రీడం ఇచ్చారని అది బాలయ్య గొప్పతనం అని అన్నారు సాయి మాధవ్ బుర్ర. అంతేకాకుండా డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి మాట్లాడుతూ ఆయన ఒక మంచి డైరెక్టర్ అని త్వరలోనే అతని పనితనం గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుందని అన్నారు. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్ వారితో మళ్ళీ మళ్ళీ పని చేయాలని ఉంది అని చెప్పుకొచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story